ETV Bharat / city

ఇంటర్​ కళాశాలలు ఆన్​లైన్​లో గల్లంతు - ఏపీ తాజా వార్తలు

ఇంటర్‌ ప్రవేశాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విద్యార్థులను ముందుగా కళాశాలలో చేర్పించాక ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆ సంస్థ పేరు కనిపించకపోయే సరికి సర్వత్రా అయోమయానికి గురవుతున్నారు. కళాశాల, కోర్సు ఎంపిక ఐచ్ఛికాలపైనా ఇదే అనిశ్చితి కొనసాగుతోంది. నేటితో మొదటి విడత కౌన్సెలింగ్‌ గడువు ముగియనుండడంతో పిల్లల భవిష్యత్తు ఏంటనే ఆవేదన తల్లిదండ్రుల్లో నెలకొంది.

Intermediate admissions
Intermediate admissions
author img

By

Published : Oct 29, 2020, 4:59 AM IST

ఇంటర్‌ ప్రవేశాలకు సంబంధించి ముందస్తు ప్రవేశాలు పొందిన కళాశాలలో సీటు వస్తుందో? లేదోనని తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలపై అవగాహన లేని చాలా మంది ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో పిల్లల్ని చేర్పించారు. నీట్, ఐఐటీ, నీట్‌ కోచింగ్‌తో పాటు ఇంటర్‌ బోధించే ప్రైవేటు కళాశాలల్లో సీట్లకు డిమాండ్‌ ఉంటుంది. దీంతో సీట్లు లభిస్తాయో లేదోననే భయంతో ముందుగానే ప్రవేశాలు పొందారు. కొంత మొత్తం రుసుములు సైతం చెల్లించారు. ఆన్‌లైన్‌ బోధన కావడంతో ఇప్పటికే కొంతవరకు పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కళాశాలలు లేకపోవడం, సీట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

ఇంటర్‌ విద్యామండలి మొదటి విడత కౌన్సెలింగ్‌కు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికి చాలా కళాశాలలు ఆన్‌లైన్‌లో లేవు. అటు కళాశాలలు, ఇటు అధికారుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. ఇంటర్‌లో ఇంత పెద్ద మార్పు తీసుకువస్తున్నప్పుడు దీనిపై ముందు నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కానీ, అధికారులు ఎలాంటి ప్రచారం లేకుండానే ఆన్‌లైన్‌ విధానమంటూ ఇటీవల ప్రకటించారు. ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు ప్రతి ఏడాదిలాగే ముందుగానే ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ ప్రవేశాలతో ఆయా కళాశాలల్లో సీట్లు రాకపోతే పరిస్థితి ఏమిటంటూ ఒత్తిడికి గురవుతున్నారు. ఏటా ఇంటర్‌లో దాదాపు ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు చేరుతున్నారు.

ఇంటర్​లో ప్రతి సెక్షన్‌కు గతంలో 88 సీట్లు ఉండగా ఇప్పుడు 40కి తగ్గించారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా.. ఇది తెలియని తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించారు. ఇప్పుడు సెక్షన్‌కు 40 సీట్లకే అనుమతిస్తూ ఆన్‌లైన్‌లో జాబితా పెట్టడంతో ముందస్తు ప్రవేశాలు పొందిన వారిలో సగం మందికే సీట్లు లభించే పరిస్థితి నెలకొంది. సీట్ల సామర్థ్యం జాబితాను సమర్పించాలని ఇంటర్‌ విద్యా మండలి ఇటీవల కళాశాలలను కోరింది. సీట్ల సంఖ్య తగ్గింపు ఉత్తర్వులను తప్పుబడుతున్న చాలా ప్రైవేటు కళాశాలలు ఈ వివరాలను సమర్పించలేదు. దీంతో అధికారులు ఆ కళాశాలలను ఆన్‌లైన్‌ జాబితాలో పెట్టలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలలు 306 ఉండగా వీటిల్లో పాతవిధానం ప్రకారం 2.50లక్షల వరకు సీట్లు ఉన్నాయి. ముందుగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో చాలా మంది మొదటి విడత కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నారు. కార్పొరేట్‌ కళాశాలల జాబితా లేకపోవడంతో ఐచ్ఛికాలు ఇవ్వడం లేదు. కొందరు తల్లిదండ్రులు మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనకపోతే రెండో విడతకు అవకాశం ఉంటుందో.. లేదోననే ఉద్దేశంతో ఐచ్ఛికాలు ఇస్తున్నారు. ఏవో ఐదు కళాశాలలను ఎంచుకుంటే వాటిల్లో ప్రవేశాలు పొందకపోయినా రెండో విడతకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండో విడతలోపు సీట్ల తగ్గింపు, అగ్నిమాపక ధ్రువపత్రాలు, వాణిజ్య సముదాయాల్లో కళాశాలల నిర్వహణ అంశాలపై స్పష్టత వస్తుందేమోనని ఆలోచిస్తున్నారు.

ఇదీ చదవండి : అనాలోచిత ఖర్చులతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.