Inter weightage: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఈ ఏడాది ఇంటర్మీడియట్ వెయిటేజీ తొలగించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించనందున గతేడాది వెయిటేజీ తొలగించారు. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులందర్నీ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులు చేశారు. అప్పుడు కేవలం ఉత్తీర్ణత మార్కులనే కేటాయించారు. మొదటి ఏడాది రెగ్యులర్ పరీక్షలు నిర్వహించనందున వెయిటేజీ తొలగించాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చదవండి:'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'