వైఎస్సార్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహార పథకం, రైతు ఆత్మహత్యల ఘటనల్లో పరిహారం అందించే బాధ్యతల్ని గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకనుంచి ఈ భీమా పథకాల అమలు, సమన్వయ బాధ్యతల్ని సంబంధిత జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాలు చూస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
మత్స్యకార భరోసా కింద 10 లక్షలు, రైతు ఆత్మహత్యల ఘటనల్లో 7 లక్షలు, పశు నష్ట పరిహార పథకం కింద 15 వేలు, వైఎస్ఆర్ బీమా కింద సాధారణ స్థితిలో మరణిస్తే 1 లక్ష రూపాయలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే 5 లక్షల బీమాను కుటుంబాలకు అందేలా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: