రాష్ట్రంలో సౌర విద్యుత్తు ఫలకాల తయారీలో పెట్టుబడులు పెట్టడానికి కోల్ ఇండియా లిమిటెడ్ ఆసక్తి చూపుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు) ఎ.కె.సమంతరాయ్, ముఖ్య మేనేజర్ సాగర్‌సేన్, డెలాయిట్ అసోసియేట్ డైరెక్టర్లు తుషార్ చక్రవర్తి, అనిర్జాబన్ బంధోపాధ్యాయ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యంతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వారికి వివరించారు.
ఇదీ చదవండి: