రాష్ట్రంలోని అన్ని ఆలయ ట్రస్ట్ బోర్డులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. కొత్త ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయాలకు అతీతంగా సేవకే పెద్దపీట వేస్తామని చెప్పారు. ట్రస్ట్ బోర్డుల్లో బీసీలు, దళితులు, మహిళలకు 50 శాతం అవకాశం ఇస్తామన్న వెల్లంపల్లి... త్వరలో 2,500 దేవాలయాలకు కొత్త ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండ్రోజుల్లో కాణిపాకం దేవస్థానం కొత్త సేవా కమిటీని నియమిస్తామన్నారు. అన్నివర్గాల వారికి భగవంతుడి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు.
ఇదీ చదవండీ...'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'