ETV Bharat / city

ఎన్నికల అక్రమాలపై మీరు నిఘా పెట్టవచ్చు!

మీ ప్రాంతంలో ఎక్కడైనా ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయా? ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తున్నారా? అయితే వెంటనే 'స్మార్ట్​'గా ఫిర్యాదు చేయండి. మీరు ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు అక్కడ వాలిపోతారు.

nigha app
nigha app
author img

By

Published : Mar 14, 2020, 11:34 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిజాయతీని ప్రోత్సహించటంతో పాటు డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ తీసుకుంటున్న చర్యలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నిఘా యాప్​ను రూపొందించింది. ఈ యాప్​ను స్మార్ట్​ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా... వారిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈ యాప్​ను తీసుకువచ్చారు.

డౌన్​లోడ్ చేద్దామిలా..

గూగుల్​ ప్లే స్టోర్​లో నిఘా యాప్​ అని టైప్ చేసి... యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలి. అనంతరం తెలుగు, ఆంగ్ల భాషల్లో కావాల్సిన భాషను ఎంచుకుని మొబైల్ నంబరును ఎంటర్​ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబరును ఎంటర్​ చేసిన తరువాత వెరీఫై ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తరువాత మీ పేరు నమోదు చేసి సబ్​మిట్​ ఆప్షన్​పై క్లిక్ చేస్తే కెమెరా, వీడియో, ఆడియో సింబళ్లు కనిపిస్తాయి. అనంతరం ఫిర్యాదును నమోదు చేయవచ్చు... పంపవచ్చు.

ఫిర్యాదు ఇలా..

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు సంబంధించి యాప్​లో కనిపిస్తున్న ఫొటో, వీడియో, ఆడియో మూడింటిలో ఒకదానిని ఎంచుకుని రికార్డు చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలను టైప్ చేసి... లేదంటే వాయిస్ రికార్డు చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారు ఎక్కడినుంచైతే సమాచారం ఇస్తున్నారో వివరాలతో సహా జీపీఎస్ ద్వారా నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూంకు చేరుతుంది. ఆ వెంటనే దగ్గరలోని అధికారులు వచ్చి ఎన్నికల అక్రమాలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇదీ చదవండి:రెండు దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.