ETV Bharat / city

Donate Kart ఫోర్బ్స్‌ జాబితాలో హైదరాబాద్‌ అంకుర సంస్థ డొనేట్‌కార్ట్

Hyderabad startup Donate Kart ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితా-2022లో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులకు చోటు దక్కింది. స్వచ్ఛంద సంస్థలు, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునే దాతలకూ మధ్య ఈ సంస్థ వారధిలాగా పనిచేస్తుంది. ఫోర్బ్స్‌ ‘ఎన్‌జీఓలు-సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో వీరు ఎంపికయ్యారు.

Hyderabad startup Donate Kart
ఫోర్బ్స్‌ జాబితాలో హైదరాబాద్‌ అంకుర సంస్థ
author img

By

Published : Feb 8, 2022, 11:31 AM IST

Hyderabad Donate Kart: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సందీప్‌ శర్మ, ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కొత్తకోటకు చెందిన అనిల్‌ కుమార్‌ రెడ్డి డొనేట్ కార్ట్​ అనే అంకుర సంస్థను ప్రారంభించారు. ఇద్దరూ ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో చదువుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన సారంగ్‌ బోబాడే ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఫోర్బ్స్‌ ‘ఎన్‌జీఓలు-సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో వీరు ఎంపికయ్యారు. ఈ ముగ్గురి వయసూ 26 ఏళ్లే. స్వచ్ఛంద సంస్థలు, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునే దాతలకూ మధ్య ఈ సంస్థ వారధిలాగా పనిచేస్తుంది. ఎవరైనా ఒక సమస్యతో ఎన్‌జీఓలను ఆశ్రయించినప్పుడు, వారి అభ్యర్థన మేరకు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపడుతుంది.

‘ఈ సంస్థను 2017 మార్చిలో ప్రారంభించాం. ఇప్పటివరకు రూ.150 కోట్ల విలువైన విరాళాలను సేకరించి, ఎన్‌జీఓలకు అందించాం. కొవిడ్‌ తొలి దశలో సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు నిత్యావసరాలను అందించాం. రెండో దశలో ఆక్సిజన్‌ సిలిండర్లు విరాళాలుగా వచ్చాయి. రెండేళ్లలోనే రూ.120 కోట్ల విరాళాలను సేకరించాం. వృద్ధాశ్రమాలు, శిశు సంరక్షణ కేంద్రాలకు ఎక్కువగా విరాళాలు అందుతున్నాయి. దాదాపు 10 లక్షల మందికి పైగా దాతలు మా ద్వారా విరాళాలు అందిస్తున్నారు. మా ఆన్‌లైన్‌ వేదికపై ఉన్న వస్తువులను ఎంచుకుని, వాటిని అవసరమైన వారికి అందించొచ్చు’ అని సందీప్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలో పేరు సంపాదించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 65 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఫోర్బ్స్‌ జాబితాలో ఈ సంస్థ పేరు సంపాదించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. టి-హబ్‌ సైతం తమ ల్యాబ్‌ 32లో భాగమైన డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: ఒమిక్రాన్‌.. పరిశీలన టీకా తయారీకి అనుమతి పొందిన సీరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.