ETV Bharat / city

హైదరాబాద్​ మెట్రోకు పెరిగిన ఆదరణ, రోజుకు 4 లక్షల మంది ప్రయాణం - 4 లక్షలకు చేరిన ప్రయాణికుల సంఖ్య

Hyderabad Metro Rush హైదరాబాద్​ మెట్రోల్లో పూర్వవైభవం కనిపిస్తోంది. మెట్రో ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పెరగటమే అందుకు నిదర్శనం. మెట్రో స్టేషన్లలో కరోనాకు ముందు కనిపించిన రద్దీ మళ్లీ దర్శనమిస్తోంది.

Hyderabad Metro Rush
హైదరాబాద్​ మెట్రో
author img

By

Published : Aug 16, 2022, 8:09 PM IST

Hyderabad Metro Rush: హైదరాబాద్ మెట్రోల్లో క్రమంగా రద్దీ పెరుగుతోంది. కరోనా కంటే ముందు సుమారుగా 4 లక్షల వరకు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేవాళ్లు. కరోనా ఫస్ట్​ వేవ్ తర్వాత ఆ సంఖ్య లక్ష నుంచి లక్షన్నరకే పరిమితమైంది. కరోనా సద్దుమణగటంతో.. మెట్రోల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల ఆ సంఖ్య కరోనా కంటే ముందులా.. 4 లక్షలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశముందని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగినట్టుగా.. మెట్రో సర్వీసుల సంఖ్య పెంచేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనా కారణంగా.. ఇంటి నుంచి విధులు నిర్వహించిన ఉద్యోగులు మళ్లీ ఆఫీసుల బాట పట్టటం వల్ల నగరంలో ట్రాఫిక్​ కష్టాలు మొదలయ్యాయి. ట్రాఫిక్​ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఉద్యోగులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్​కు వర్షాలు కూడా తోడవటంతో.. ప్రజలు మెట్రోవైపే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా మెట్రోకు మునుపటి ఆదరణ దక్కుతోంది. మరోవైపు.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం సూపర్ సేవర్ కార్డు కూడా.. ప్రవేశపెట్డడంతో సెలవు రోజుల్లో మరింత ఆదరణ కనిపిస్తోంది. రెండో శనివారాలు, సెలవుదినాల్లో ఈ సూపర్​ సేవర్​ కార్డుదారుల రద్దీ కూడా కొనసాగుతుండటంతో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన సౌకర్యాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.