ETV Bharat / city

హుజూర్​నగర్ ఉప​ ఎన్నికకు సర్వం సిద్ధం - tpcc chief uttam kumar reddy

తెలంగాణలో హుజూర్​నగర్​ సమరానికి సర్వం సిద్ధమైంది. ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 28 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. 302 పోలింగ్​ కేంద్రాల్లో 1500 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.

తెలంగాణలో నేడే హుజూర్​నగర్​ ఎన్నికల సమరం
author img

By

Published : Oct 21, 2019, 12:06 AM IST

Updated : Oct 21, 2019, 7:14 AM IST

తెలంగాణలో నేడే హుజూర్​నగర్​ ఎన్నికల సమరం

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ఉప ఎన్నికకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని హుజూర్​నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల పరిధిలో 2 లక్షల 36 వేల 842 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో లక్షా 20 వేల 427 మంది మహిళలుండగా... లక్ష 16 వేల 415 పురుష ఓటర్లున్నారు.

పటిష్ఠ భద్రత

369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలు పోలింగ్​ విధుల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గాన్ని 27 రూట్లుగా విభజించి... ఒక్కో రూట్​కు ఒక్కో డివిజన్ స్థాయికి అధికారికి బాధ్యతలు అప్పగించారు. డీఐజీ, ఎస్పీతోపాటు 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు... విధుల్లో ఉన్నారు. సీఐఎస్ఎఫ్​కు చెందిన 3 కంపెనీలు, సీఆర్పీఎఫ్​కు చెందిన మరో 3 బలగాలతోపాటు రాష్ట్ర స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన నాలుగు వందల మంది భద్రతలో పాలుపంచుకోనున్నారు. స్థానిక బలగాలతోపాటు 10 ప్రత్యేక బృందాలు, టాస్క్​ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, తక్షణ ప్రతిస్పందన దళాలు పనిచేస్తున్నాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కరన్​ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

144 సెక్షన్

79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించగా... రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకో ఇన్స్ పెక్టర్ ఆధ్వర్యలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 302 పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్-144 తోపాటు 30-యాక్టును అమలు చేస్తున్నారు. జిల్లా సగటుతో పోలిస్తే గత ఎన్నికల్లో హుజూర్ నగర్​లో 2 శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో... 90 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి.

గుర్తింపు కార్డు చూపించి

302 కంట్రోల్ యూనిట్లు, 604 బ్యాలెట్ యూనిట్లు, 302 వీవీప్యాట్లు అందుబాటులో ఉంచారు. వీటికితోడు మరో 20 శాతం యంత్రాల్ని... రిజర్వ్ చేసి పెట్టారు. ఓటర్ల​కు ఇప్పటికే ఓటరు స్లిప్​లు పంపిణీ చేశారు. గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా అధికారులు ఓటర్లను కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలుత మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.

బరిలో 28 మంది

హుజూర్​నగర్​ ఎన్నికల బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరందరి భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. కాంగ్రెస్ నుంచి పద్మావతిరెడ్డి, తెరాస తరఫున శానంపూడి సైదిరెడ్డి, భాజపా నుంచి కోట రామారావు, తెదేపా తరఫున చావా కిరణ్మయి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్​ మల్లన్న పోటీలో ఉన్నారు.

ఇవీ చూడండి:

హస్తిన పర్యటనకు ముఖ్యమంత్రి జగన్

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా రెవెన్యూ అధికారులు పోలీసులు ఎన్నికల సిబ్బంది కౌంటర్ల వద్ద కు తరలి వెళ్తున్నారు హుజూర్నగర్ లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 302 మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల 36 వేల ఎనిమిది వందల 42 పదిహేను వందల మంది వీధుల్లో పాల్గొన్నారు మొత్తం ఈవీఎంల సంఖ్య 3782 సమస్యాత్మక ప్రాంతాలు 79 గలవు రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగును

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Last Updated : Oct 21, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.