వంద రోజుల వైకాపా పాలన అంతా.. హత్యలు, దౌర్జన్యాలు, కబ్జాలమయమని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. వైకాపా బాధితుల శిబిరాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ వంద రోజుల్లో దళితులు, బీసీలపై దాడులు పెరిగాయన్నారు. కక్ష సాధించేందుకే వైకాపా అధికారంలోకి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. వైకాపా దాడులపై తెదేపా కార్యకర్తలు దాడులు చేసినా...పోలీసులు కేసులు నమోదు చేయటం లేదన్నారు. తప్పులను ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇలా ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. పల్నాడులో తెదేపా కార్యకర్తలు గ్రామాల్లో ఉండలేని దుస్థితి ఏర్పడిందన్నారు. తెదేపా శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లేలా హోమంత్రి, డీజీపీ చొరవ తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి
బాబాయిని చంపిందెవరో చెప్పలేని వ్యక్తి.. మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు