ETV Bharat / city

కొవిడ్‌ వేళ.. పరిమళిస్తున్న మానవత్వం! - corona cases at andhra pradesh

కరోనా విలయం సృష్టిస్తున్న వేళ... ఆప్తులు కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో... మేమున్నామంటూ బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు కొందరు మానవతా మూర్తులు.  దిక్కెవరో తెలియక బిక్కుబిక్కు మంటున్న బాధితులకు ధైర్యం చెబుతూ... అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండే కొవిడ్‌ బాధితులకు ఆహారం అందించడం, అవసరమైన వారికి ఆక్సిజన్‌ సరఫరా చేయటం, డాక్టర్లతో వైద్యపరమైన సలహాలు అందించటం, ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి సమాచారం ఇవ్వటం సహా అనేక రకాలుగా సమాజానికి సాయం చేస్తున్నారు. కష్ట కాలంలో సాటి మనుషులకు సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించి ముందడుగు వేస్తున్నారు.

humanity during corona situation
కొవిడ్‌ వేళ పరిమళిస్తున్న మానవత్వం..
author img

By

Published : May 27, 2021, 8:16 AM IST

‘‘మీరు కొవిడ్‌ బాధితులా? ఇంట్లో ఆహారం సిద్ధం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మాకు ఒక్క కాల్‌ చేయండి. మేమే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం’’ అంటూ ఈ సంక్షోభ సమయంలో అండగా నిలుస్తోంది నారీసేన గ్లోబల్‌ ఉమెన్‌ ఫోరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నైల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ సేవలందిస్తోంది. ఈ బృందంలో ఉన్నవారంతా మహిళలే. వారిలో వైద్యులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

బాధితుల నుంచి వచ్చే ఫోన్లు ప్రతీరోజూ స్వీకరించటం, ఆ సంఖ్యకు అనుగుణంగా ఇంట్లోనే ఆహారాన్ని సిద్ధం చేయటం, వాలంటీర్లు, డెలివరీ బాయ్‌ల ద్వారా పంపిణీ చేయించటం వంటి బాధ్యతలన్నీ ఎక్కడికక్కడ వారే చూస్తుంటారు. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు లతా చౌదరి బొట్ల అన్ని ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్నీ సమన్వయం చేస్తున్నారు. ఏప్రిల్‌ 29న ఈ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, శ్రీకాకుళం నగరాల్లో రోజుకు 400 మంది కొవిడ్‌ బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు.

ఇప్పటివరకూ మొత్తం 6-7 వేల మంది వీరి సేవల్ని వినియోగించుకున్నారు. నారీసేన గ్లోబల్‌ ఉమెన్‌ ఫోరం సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది సభ్యులున్నారు. ఆయా నగరాల్లో ఉన్న సభ్యులు స్థానికంగా ఈ ఆహార పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహారం పంపిణీ పూర్తయిన తర్వాత దాని నాణ్యతపై ప్రతిరోజూ బాధితుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటికనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు. ఈ సంస్థ నుంచి సేవలు పొందేందుకు ఈ కింది నెంబర్లలో సంప్రదించొచ్చు.

రూ.2 లక్షలతో మొదలుపెట్టి.. ఎందరికో ‘‘మార్గం’’ చూపి

అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపేవారు ఇలా అనేక మంది కరోనా వేళ విజయవాడ నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆకలితో అలమటిస్తూ ఉండటం చూసి ఆమె చలించిపోయారు. వారికి ఏమైనా చేయగలనా? అని ఆలోచించి ఆమె వద్దనున్న సొమ్ములో రూ.2 లక్షలు తీసి.. వారికి ఆహారం పంపిణీ చేయటం ప్రారంభించారు. ఇలా నెల కిందట ప్రారంభించిన సేవల్ని దాతల సహకారంతో మరింత విస్తరించారు మార్గం ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు అడ్డగళ్ల లక్ష్మీ అన్నపూర్ణ. విజయవాడలో రోడ్లపక్కన నిరాశ్రయులుగా ఉంటున్న 250-300 మందికి రోజూ రాత్రిపూట ఆహార పొట్లాలు అందిస్తున్నారు.

అలాగే ఎవరైనా కొవిడ్‌ బారిన పడి.. ఇంట్లో ఆహారం సిద్ధం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. రోజూ మధ్యాహ్నం పూట వారి ఇంటికి తీసుకెళ్లి ఆహారాన్ని అందిస్తారు. ఇలా విజయవాడ నగరంలో రోజుకు 200-220 మంది కొవిడ్‌ బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత 15 రోజులుగా నిర్వహిస్తున్నారు. మార్గం ఫౌండేషన్‌ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రొఫైల్‌ సిద్ధం చేశారు. కొవిడ్‌ బాధితులు ఎవరైనా సరే వారికి ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, మందులు తదితర అవసరాలపై అందులో సంప్రదిస్తే.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం వాలంటీర్ల బృందాన్ని సిద్ధం చేశారు. అర్ధరాత్రి 2 గంటల వరకూ వీరు పనిచేస్తుంటారు. ఇప్పటివరకూ ఇలా 700 మందికి సేవలందించారు. విజయవాడలో ఉన్నవారు మార్గం ఫౌండేషన్‌ ప్రతినిధుల్ని కింది నంబర్‌లో సంప్రదించొచ్చు.

ప్రాణవాయు దాతలు

కొవిడ్‌ బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అనేక రకాల సేవలందిస్తోంది జమాతే ఇస్లామీ హింద్‌ సంస్థ. కొవిడ్‌ రెండో దశలో ఆక్సిజన్‌ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా కొందరి ప్రాణాలనైనా కాపాడాలనే ఉద్దేశంతో 400 ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చుకుంది. అత్యవసరమైన వారు తమను సంప్రదిస్తే వాటిని అందిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 5 వేల మంది ఈ సేవలు పొందారు. ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకోవాలనుకునేవారి కోసం ఆన్‌లైన్‌ వైద్యసేవల్ని అందిస్తోంది. దీని కోసం పలువురు వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 12 అంబులెన్సులు సిద్ధం చేసి అవసరమైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లటం, కోలుకున్న వారిని ఇంటికి చేర్చటం కోసం వినియోగిస్తోంది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లోని కొవిడ్‌ ఆసుపత్రుల వద్ద ఉండే బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఒక్క విజయవాడ ఆసుపత్రి వద్దే రోజుకు 500 మందికి భోజనాలు పెడుతున్నారు. కొవిడ్‌ మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాకపోతే.. ఈ సంస్థ ప్రతినిధులే దగ్గరుండి ఆ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో వీరి సాయం కోసం ఈ కింది నెంబర్లలో సంప్రదించొచ్చు.

ఫోన్‌ నంబర్లు: 9908018774, 9848527991

ఆసుపత్రిలో ఉండే రోగుల సహాయకుల కోసం

కరోనా వేళ ప్రసవాల కోసం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులు, వారి తరఫు కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం కర్ఫ్యూ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఆహారం లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చుతున్నారు...తిరుపతికి చెందిన అమ్మఒడి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి గోపాల్‌. తిరుపతిలోని కొత్త ప్రసూతి ఆసుపత్రి వద్ద రోజూ మధ్యాహ్నం 300-350 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు.

కొవిడ్‌ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో వారి సహాయకులుగా వచ్చిన కుటుంబ సభ్యులుకూ ఈ ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. ఓ హోటల్‌ నడుపుకొనే గోపాల్‌.. స్వయంగా ఓ వ్యాన్‌లో ఆహార పొట్లాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇలా పంపిణీ చేస్తున్నా.. కరోనా నేపథ్యంలో ఆ సేవల్ని మరింత విస్తృతపరిచారు.

మిత్రులతో కలిసి... విస్తృత సేవలు

ఆయనో ప్రభుత్వోద్యోగి. తనలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డ, వ్యాపారాలు నిర్వహిస్తున్న మిత్రుల్ని సంప్రదించి వారి సహకారంతో కొవిడ్‌ బాధితులకు ఆహార పంపిణీ ప్రారంభించారు ఫ్యూచర్‌ ఇండియా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సతీష్‌ సావిత్రి సరెళ్ల. కొవిడ్‌ బారిన పడి గృహ ఏకాంతంలో ఉన్న వారికి విజయవాడ, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, శ్రీకాకుళం, ఉయ్యూరు ప్రాంతాల్లో ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు.

విజయవాడలో రోజుకు 315 మంది, మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి రోజుకు 185 మందికి మూడు పూటలా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఈ సేవల్ని కొనసాగిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ పలువురికి ఆహారం అందజేశారు. ఈ సంస్థ ప్రతినిధుల్ని ఈ కింది నంబర్‌లో సంప్రదించొచ్చు.

ఫోన్‌ నంబర్‌: 8317553253

ఇదీ చదవండి:

అంజనీపుత్రుడి జన్మస్థలంపై నేడు తితిదేతో చర్చ.. సర్వత్రా ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.