తెలంగాణ: ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ.. హడలెత్తిపోయిన కుటుంబం - కొండచిలువ హల్‌చల్
తెలంగాణలోని హన్మకొండ పరిమళకాలనీలో కొండచిలువ కలకలం సృష్టించింది. సుమన్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఆరు అడుగుల కొండచిలువ కనిపించగా.. కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న జూ సిబ్బంది.. కొండచిలువను బంధించారు. అనంతరం ములుగు అటవీ ప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు.
ఇంటి పరిసరాల్లో భారీ కొండచిలువ