ETV Bharat / city

సబ్బు నిజంగానే వైరస్​ను నాశనం చేస్తుందా?

author img

By

Published : Mar 29, 2020, 3:45 PM IST

Updated : Mar 29, 2020, 5:14 PM IST

కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. ప్రజలు.. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. తరచూ చేతులు కడుక్కుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి చేతులు శుభ్రం చేసుకుంటే వైరస్ నాశనం అవుతుందా..? అనేది తెలుసుకుందాం..!

krishna district
సబ్బు చేసే మేలు

సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవటం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్షజీవుల నుంచి రక్షణ లభిస్తోంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణు ధర్మాలు సబ్బుకు ఉన్నాయి.

ఇలా చేయండి..

⦁ చేతులను 20 సెకన్ల పాటు సబ్బుతో రుద్ది కడుక్కోవాలి. ఇలా చేస్తే చేతుల మీద ఉందే వైరస్, అది కరోనా అయినా.. నీటితోపాటు కొట్టుకుపోతుంది. సబ్బులో ఉండే హైబ్రిడ్​ నిర్మాణమే ఇందుకు కారణం.

⦁ సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ అంటారు. పై భాగం నీటితో, కింది భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. ఈ ప్రత్యేక లక్షణమే మన చర్మానికి, వైరస్​కు మధ్య ఉండే పదార్థాన్ని తొలగించగలుగుతుంది. మనం నీటితో చేతులు కడిగినప్పుడు.. నీరు, సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్ తనతో తీసుకుపోతుంది.

⦁ సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వులు వైరస్​ను తొలగించే గుణాన్ని కలిగి ఉంటాయి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్​ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి:

శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే!

Last Updated : Mar 29, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.