ఆంధ్రప్రదేశ్‌ను మద్యం రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని... హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా... దశల వారీగా మద్యం నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్... ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. జనవరి నుంచి బార్లకు సంబంధించి కొత్త లైసెన్స్ విధానం వస్తుందన్నారు. మద్యం ధరలు మరింత పెరగనున్నాయని తెలిపారు. మద్యం విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఎన్నికైన సందర్భంగా... గుంటూరులో ఆయనను సన్మానించారు.
ఇదీ చదవండి : బతుకు పోరాటం.. తీరం నుంచి దూరం!