ETV Bharat / city

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆగదు: హోంమంత్రి - తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వార్తలు

పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 90శాతం అమలు చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

home minister sucharitha comments on rtc murger in governament
author img

By

Published : Nov 25, 2019, 4:49 PM IST

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆగదు: హోంమంత్రి

పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ 90 శాతం అమలు చేస్తున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశానికి హాజరైన హోంమంత్రి.. విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లపట్టాలు అందిస్తామని.. అందులో విశ్రాంత ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల పట్టాలిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : మెళకువలు నేర్చుకున్నాం.. ఇక రయ్యంటూ దూసుకెళ్తాం..

AP_GNT_02_25_HOME_MINISTER_ON_RTC_RETIRED_EMPLOYEES_WELFARE_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: KESAVARAO ( ) పాదయాత్ర, మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 90 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమఫలాలు చేరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశానికి హాజరైన హోంమంత్రి.... విశ్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తమ ఇంట్లోనూ ఆర్టీసీ కార్మికున్నారని.. వారి సమస్యలేంటో తనకు అవగాహన ఉందన్నారు. కొందరు విశ్రాంత కార్మికులకు 300కి మించి ఫించన్ రావడం లేదన్న హోంమంత్రి సుచరిత.. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. 40వేల లోపు ఆదాయమున్నవారికి ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పిస్తామన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లపట్టాలు అందిస్తామని.. ఇందులో విశ్రాంత ఆర్టీసీ కార్మికులకు అవకాశాన్ని పరిశీలిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు...BYTE... BYTE: మేకతోటి సుచరిత, హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.