కర్నూలులో హోలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. నగరంలోని చాణక్యపురి కాలనీలో మహిళలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు వేసుకుంటూ.. నృత్యాలు చేస్తూ ఉల్లసంగా హోళీ ఆడారు.
ఆకట్టుకున్న తండాల్లోని గిరిజన నృత్యాలు..
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని గిరిజన తండాల్లోని మహిళలు హోలీని ఘనంగా నిర్వహించారు. సుగాలి గిరిజన సంప్రదాయ నృత్యాలు, రంగోలి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మండలంలోని 15 తండాలు, పెద్దమండ్యం మండలంలోని 20 తండాల్లోని గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఈ పండుగను చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న కోపతాపాలు, మనస్పర్ధలు మరచిపోయి.. హోలీ పండుగ రోజున ప్రతి కుటుంబం నుంచి సభ్యులు హాజరై పండుగ నిర్వహిస్తారని గిరిజన పెద్దలు పేర్కొన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తాండ గ్రామాల్లో తొలిసారి సర్పంచ్‌లుగా ఎన్నికైనవారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కడపలో అంబరాన్నంటిన సంబరాలు..
హోలీ సందర్భంగా కడపలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అఖిలభారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాలు సాంప్రదాయ దుస్తులు ధరించి హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. అందరూ హాజరై వారి వారి శైలిలో ముత్యాలు చేస్తూ సంతోషంగా హోలీ ఆడారు.
మరాఠీ సంఘం ఆధ్వర్యంలో హోలీకా దహన్..
మరాఠీ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోని మండపాల విధిలో హోలీ ఉత్వసలో భాగంగా హోళికా దహన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. అందరూ కలిసి హోలీ ఆడుతూ.. ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో పెద్దలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
గో కరోనాకు అంటూ.. స్వచ్ఛ కార్యకర్తల హోలీ సంబరాలు..
కృష్ణా జిల్లా నాగాయలంకలో స్వచ్ఛ నాగాయలంక కార్యకర్తల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. గో కరోనాకు అంటూ.. ప్రధాన కూడలిలో సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతూ.. రసాయన రహిత రంగులతో ఉత్సాహంగా స్వచ్ఛ కార్యకర్తలు హోలీ ఆడారు. కరోనా రెండో దశ విజృంభన కారణంగా జాగ్రత్తలు పాటిస్తూ.. ఆనవాయితీ పోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగల సంప్రదాయాలను చాటేందుకు హోలీ జరపినట్లు.. స్వచ్ఛ అధ్యక్షుడు సింహాద్రి కృష్ణప్రసాద్, తలశిల రఘుశేఖర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: