గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ భూసమీరణలో భాగంగా తమతో చేసుకున్న ఒప్పందానికి అధికారులు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీచేయాలని సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. తాము ప్రభుత్వానికి ఇచ్చిన 39.51 ఎకరాలకు రూ.210 కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు. అశ్వనీదత్ వేసిన పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ అయ్యింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.
ఈ వ్యాజ్యం సింగిల్ జడ్జి బెంచ్ ముందుకు విచారణకు రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. వ్యాజ్యాన్ని పరిశీలించి తగిన బెంచ్ వద్దకు పంపేందుకు ఫైల్‌ను హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కేసరపల్లి గ్రామ పరిధిలోని తమకు చెందిన 39.51 ఎకరాలను ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం భూసమీకరణలో ఇచ్చామని .. అందుకు బదులుగా రాజధాని అమరావతిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని అధికారులు ఒప్పందం చేసుకున్నారని ఆశ్వనీదత్ దంపతులు హైకోర్టుకు తెలిపారు. ట
ఇదీ చదవండి : కారులో మద్యం... దుర్గ గుడి బోర్డు మాజీ సభ్యురాలి కుమారుడిపై కేసు