ఉపాధిహామీ నిధుల గురించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2018-19లో చేసిన పనులకు నిధులు విడుదల చేయడం లేదని పిటిషన్ దాఖలైంది. విడుదలకు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నిధుల విడుదలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... 'వచ్చే శ్రావణ శుక్రవారంలోపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి'