వార్డు మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యాజ్యాలు ఉపసంహరించుకోవాలంటూ కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసుశాఖలో ‘మహిళా పోలీసులు’గా పరిగణిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 23న జారీ చేసింది. జీవో 59ని రద్దు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు అక్టోబర్ 22న వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: