తితిదే ఆస్తుల అమ్మకాల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తితిదే ఆస్తులను వేలం వేయడం చట్ట విరుద్ధమని న్యాయవాది బాలాజీ వాదించారు. భవిష్యత్తులో దేవస్థానం ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
తితిదే ఆస్తులను అధికార వెబ్సైట్లో పెట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆస్తులు వేలం వేయట్లేదు
తితిదే ఆస్తుల వేలం వేయట్లేదని తితిదే స్టాండింగ్ కమిటీ సభ్యుడు డా. మజ్జి సూరిబాబు తెలిపారు. వెబ్‌నార్ ద్వారా ఆస్తుల వివరాలు, తితిదే నిర్ణయాలను హైకోర్టుకు వివరించారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యుడికి హైకోర్టు సూచించింది.
ఇదీ చూడండి: