ETV Bharat / city

'గ్రూప్​ - 1 ప్రిలిమ్స్​ ఫలితాలు వెల్లడించొద్దు' - గ్రూప్​ -1 ఫలితాలపై హైకోర్టు స్టే

గ్రూప్​-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని పేర్కొంటూ... విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

గ్రూప్​ - 1ఫలితాలు
author img

By

Published : Oct 1, 2019, 5:59 AM IST

గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఫలితాలు వెల్లడించవద్దని ఏపీపీఎస్సీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 2018 డిసెంబర్లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం సర్వీస్​ కమిషన్​ ప్రకటన జారీ చేసింది. పరీక్ష సమయంలో క్యాలిక్యులేటర్లు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్​లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు క్యాలిక్యులేటర్​ను అనుమతించలేదని, తెలుగు అనువాదంలో 75 తప్పులు దొర్లాయని పేర్కొంటూ 15 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నియామక ప్రక్రియపై తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి... పరీక్ష ఫలితాలను నిలిపేయాలంటూ ఉత్తర్వులిచ్చారు. మరోవైపు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ - 2 ఫలితాలను కూడా ప్రకటించవద్దని ధర్మాసనం తెలిపింది.

'గ్రూప్​ - 1 ప్రిలిమ్స్​ ఫలితాలు వెల్లడించవద్దు'

ఇదీ చూడండి:

మద్యం గరిష్ఠ చిల్లర ధరపై భారీగా పన్ను వడ్డింపు..!

This is test file from feedroom
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.