తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ నెల 30వ తేదీకి తదుపరి వాదనలను వాయిదా వేసింది. హైకోర్టు ఎదుట వాదనలు వినిపించిన పనాబక లక్ష్మి.. ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. రీపోలింగ్ కు ఆదేశించాలని కోరారు. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని రత్నప్రభ విజ్ఞప్తి చేశారు.
వీటిపై ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల్లో దొంగ ఓట్లు అక్రమాలను ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ వేదిక ఉందని వ్యాఖ్యానించింది. అనుబంధ పిటిషన్‌తో పాటు, తెదేపా అభ్యర్థి చేసిన వ్యాజ్యాన్ని ఈనెల 30 విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
ఇవీ చదవండి: