మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో గ్రామాల్ని విలీనం చేసినంత మాత్రాన ఆ గ్రామాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉద్యోగులు కాదని స్పష్టం హైకోర్టు చేసింది. విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ నుంచి జీతాలు పొందుతున్నంత కాలం ఆ ఉపాధ్యాయులు మున్సిపల్ ఉద్యోగులు కాదని తేల్చి చెప్పింది. వారు పంచాయతీ ఉద్యోగులవుతారనే పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం పాఠశాల విద్యాశాఖ గత ఏడాది అక్టోబర్ 12న మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం అయిన గ్రామ పంచాయితీల్లోని పాఠశాలల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా తమను బదిలీ చేయడానికి వీల్లేదని కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ నామినేషన్ల సందడి