ETV Bharat / city

'బకాయిలు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వండి' - HC_On_PPA_Companies latest

ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం సంతోషరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు 4 వారాల్లో బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

high-court-on-ppa-companies
'బకాయిలు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వండి'
author img

By

Published : Feb 6, 2020, 7:03 AM IST

పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు 4 వారాల్లో బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని... ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం సంతోషరావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్‌ యూనిట్‌కు 2 రూపాయల 43 పైసలు, సౌర విద్యుత్‌ యూనిట్‌కు 2 రూపాయల 44 పైసలు చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఆదేశించినా.. ప్రభుత్వం చెల్లించలేదని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారని ధర్మాసనం నిలదీయడంతో 4 వారాల్లోగా చెల్లిస్తామని గత డిసెంబర్‌లో సీజీఎమ్​ హైకోర్టుకు ప్రమాణ పత్రం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించలేదని విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సీజీఎమ్​ ను వివిరణ కోరింది.

ఇవీ చూడండి-'ఉత్తరాంధ్ర రైతులకు అమరావతి పరిస్థితి రాకుండా చూడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.