ETV Bharat / city

వలస కూలీల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలేంటి..? - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

వలస కులీల సమస్యలు పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వలస కూలీల సమస్యలపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేసింది.ఈ సందర్భంగా ‘కన్నీళ్ల మాటున కష్టాల నడక’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

high court on migrant labourers
high court on migrant labourers
author img

By

Published : May 15, 2020, 6:36 PM IST

Updated : May 16, 2020, 6:22 AM IST

చేయడానికి పని లేక.. తినడానికి తిండి దొరక్క.. సొంతూళ్లకు వెళ్లడానికి వేలకొద్దీ మైళ్ల నడక మొదలుపెట్టిన వలస కూలీల దుస్థితి చూసి హైకోర్టు చలించింది. వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ‘కన్నీళ్ల మాటున కష్టాల నడక’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

గుంటూరు జిల్లా కాజ టోల్‌గేటు సమీపంలో ఈనెల 13-14 తేదీల మధ్య 24 గంటల సమయంలో ఒక్క చెక్‌పోస్టు మీదుగానే నడక, సైకిళ్ల ద్వారా 1,300 మంది వలస కార్మికులు వెళ్తున్న వైనంపై ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలోని అంశాలను గుర్తుచేసింది. ఓ మహిళ నాసిక్‌ నుంచి సతానీకి నడిచి వెళ్తూ బిడ్డకు జన్మినిచ్చి, కాన్పు అయిన రెండు గంటలకే మళ్లీ నడక మొదలుపెట్టిందంటూ ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిన అంశాన్ని గమనంలోకి తీసుకుంది. ఈ ఘటనలు ప్రస్తుత దయనీయ పరిస్థితిని గుర్తుచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

వలస కూలీల సమస్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వందలమంది వలస కూలీలు.. పిల్లలు, సామగ్రితో జాతీయ రహదారులపై నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రతి 50 కి.మీ.కి రాష్ట్రప్రభుత్వం ఆహార కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు చేసింది. వీటికి తోడు మేము పేర్కొన్న విషయాలనూ ప్రాధాన్యక్రమంలో తక్షణం అమలుచేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి: రిషితేశ్వరి కేసు ఆరు నెలల్లోపు తేల్చాలి: హైకోర్టు

Last Updated : May 16, 2020, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.