ETV Bharat / city

'జగన్ కేసుల ఉపసంహరణపై దస్త్రాలు పరిశీలించాక తగిన ఉత్తర్వులిస్తాం' - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

సీఎం జగన్​పై ఉన్న కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ జరిగింది. క్రిమినల్ కేసుల ఉపసంహరణ విషయంలో హైకోర్టు అడ్మిని స్ట్రేటివ్ కమిటీ ఇచ్చిన దస్త్రాన్ని తమ ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.

high court on cm jagan cases Withdrawal
high court on cm jagan cases Withdrawal
author img

By

Published : Jun 26, 2021, 5:49 AM IST

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన 11 క్రిమినల్‌ కేసుల ఉపసంహరణ విషయంలో ‘హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ’ ఇచ్చిన దస్త్రాన్ని(ఫైల్‌) సీల్డ్‌ కవర్లో తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను(రిజిస్ట్రీ) హైకోర్టు ఆదేశించింది. ఆ ఫైల్‌ను పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత శుక్రవారం ఈ మేరకు స్పష్టంచేశారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఆ ఫైల్‌ను తమకు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తే.. ఆ దస్త్రాన్ని మీకు అందజేయాలని ఆదేశిస్తామని న్యాయమూర్తి తెలిపారు.

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 2016లో 11 క్రిమినల్‌ కేసులు నమోదు అయ్యాయి. దిగువ న్యాయస్థానాల్లోని ఆ కేసులను పోలీసులు, ఫిర్యాదుదారులు, సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా ఉపసంహరించారని హైకోర్టు పరిపాలన కమిటి సుమోటోగా క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు నమోదు చేయాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన కొద్దికాలానికే.. 2016లో జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో పోలీసులు తక్కువ వ్యవధిలోనే దిగువ న్యాయస్థానాల్లో తుది నివేదికలను(ఫైనల్‌ రిపోర్ట్‌) దాఖలు చేశారని పిటిషన్లలో హైకోర్టు పేర్కొంది. తుది నివేదికలను మెజిస్ట్రేట్లు అంగీకరించి, కేసుల్ని హడావుడిగా మూసేశారని వెల్లడించింది. ఫిర్యాదుదారుల నుంచి మెజిస్ట్రేట్లు అఫిడవిట్లు తీసుకోలేదని, కేసుల మూసివేతకు కారణాలు పేర్కొనలేదని ఆక్షేపించింది.

హైకోర్టు రోస్టర్‌ ప్రకారం సుమోటో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు జస్టిస్‌ లలిత వద్దకు ఈనెల 23న విచారణకు వచ్చాయి. ఏజీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసే ముందు ఈ వ్యవహారానికి సంబంధించిన దస్త్రాలను పరిశీలించాలని న్యాయమూర్తిని కోరిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకురాగా.. పరిపాలన కమిటీ ఇచ్చిన దస్త్రాలను పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీచేస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.