హైకోర్టులో బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైకోర్టు తరలింపునకు నిరసనగా.. ఈ నెల 26, 27 తేదీల్లో విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయించారు. 26న ప్రకాశం బ్యారేజ్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు న్యాయవాదుల ఐకాస ఛైర్మన్ చలసాని అజయ్ ప్రకటించారు. హైకోర్టును తరలించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విధులు బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి :