ETV Bharat / city

వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు: ఎస్ఈసీ - High court judgment reserve volunteers in election

పురపాలక ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాల్లో మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది.

High court judgment reserve volunteers in election
వాలంటీర్ల వ్యవహారంపై తీర్పు రిజర్వు
author img

By

Published : Mar 3, 2021, 6:06 AM IST

'పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. అందుకే వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులు జారీచేశాం. పింఛన్ల అందజేత తదితర పథకాల పంపిణీకి మేం అభ్యంతరం చెప్పలేదు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయరు అనుకున్న వాళ్లకు వాలంటీర్లు ఓటరు స్లిప్పులు పంచడం లేదు. అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలనే వాలంటీర్లను దూరంగా ఉంచాం’ అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ హైకోర్టుకు నివేదించారు.

ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘పథకాల పంపిణీ కోసం వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు లేకుండా లబ్ధిదారులకు పంపిణీ సాధ్యం కాదు. ఎన్నికలతో వాలంటీర్లకు సంబంధం లేదు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ ఆరోపణలు అవాస్తవం. వాలంటీర్ల వద్ద మొత్తం సమాచారం ఉండదు. పథకాల లబ్ధిదారుల వివరాలే ఉంటాయి. ఎస్‌ఈసీ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం’ అన్నారు. పురపాలక ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవహారంపై దాఖలైన మూడు వ్యాజ్యాల్లో మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం తీర్పు వెల్లడిస్తానని తెలిపారు. వార్డు వాలంటీర్లను మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై గ్రామ, వార్డు వాలంటీర్‌ గ్రామ, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌జైన్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై న్యాయమూర్తి విచారణ జరిపారు.

పుర ఎన్నికలపై అప్పీళ్ల కొట్టివేత
పురపాలక ఎన్నికల విషయంలో జోక్యానికి నిరాకరిస్తూ ఫిబ్రవరి 26న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన మూడు అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కరోనా కారణంగా ఎస్‌ఈసీ ఎన్నికలను వాయిదా వేయడాన్ని, నిలిచిపోయిన దగ్గర్నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొనడంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని గుర్తుచేసింది. ఫిబ్రవరి 15న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సింగిల్‌ జడ్జి కొట్టేయగా వారు ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులలోనే.. నిలిచిపోయిన దగ్గర నుంచి తర్వాత ప్రారంభిస్తామని స్పష్టంగా ఉన్నట్లు గుర్తుచేసి అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది.

మళ్లీ నామినేషన్లపై హైకోర్టులో వ్యాజ్యాలు
పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ వేయడానికి వీలు కల్పిస్తూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అక్కడ ఇప్పటికే నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు వ్యాజ్యాలపై విచారణ జరిపారు. బుధవారం నిర్ణయం వెల్లడిస్తానన్నారు.

అడ్డంకులకు ఆధారాలున్నాయి: ఎస్‌ఈసీ
నామినేషన్ల పర్వంలో అడ్డంకులు, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినందునే పుర ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చినట్లు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ తెలిపారు. ఫిర్యాదులపై స్పందించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీపై ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినవారిపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలన్నారు. చట్టంలో నిర్దిష్టమైన నిబంధనలు లేనప్పుడు.. కమిషన్‌ అధికారాన్ని వినియోగించొచ్చన్నారు. 14 చోట్ల నామినేషన్లకు అవకాశం ఇస్తే.. నాలుగు చోట్ల సద్వినియోగం చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

విశాఖ సహా 10 పోర్టులపై ప్రైవేటు ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.