ETV Bharat / city

Amaravati Victory: అమరావతికి అనుకూలంగా తీర్పు.. ఫలించిన రైతుల పోరాటం

AP High Court Verdict on CRDA: అమరావతి రైతుల అలుపెరగని పోరాటం ఫలించింది. 807 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి న్యాయస్థానం విజయంతో పరిపూర్ణత దక్కింది. అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తేల్చిచెప్పడంతో రాజధానికి భూములిచ్చిన రైతులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా సీఎం జగన్‌...ఏకపక్ష, నిరంకుశ విధానాలను విడనాడి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.

high court judgment on crda overall
అమరావతిపై హైకోర్టు తీర్పు
author img

By

Published : Mar 3, 2022, 12:52 PM IST

Amaravati Win: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి ఓ మహానగరం నిర్మిద్దామన్న గత ప్రభుత్వ పిలుపుతో అమరావతి రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్‌పూలింగ్‌ విధానంతో ఏళ్లుగా జీవనాధారమైన భూములను ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ వచ్చి నూతన రాజధానికి శంకుస్థాపన చేయడంతో అభివృద్ధికి ఢోకా లేదనుకున్నారు. నిర్మాణాలూ ప్రారంభమై.. కొన్ని పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాకలాపాలు అమరావతి నుంచే జరగడం మొదలైంది.

ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. రాజధాని మీద నిర్ణయమూ మారింది. 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. భవిష్యత్‌ ఆశలు కళ్లముందే కూలిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి గొడ్డలిపెట్టులా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్ణయం మార్చుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మొరపెట్టుకున్నారు. అయినా పాలకుల్లో మార్పు రాలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదంటూ..అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. మండలిలో ఘర్షణ వాతావరణం తర్వాత....బిల్లుకు గవర్నర్‌ ఆమోదంతో చట్టం రూపొందింది.

కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమంటూ ఆందోళనకు దిగారు. వివిధ రూపాల్లో నిరసనలు పెల్లుబికాయి. రెండు చట్టాల్ని హైకోర్టులో సవాల్ చేయడంతో..వాటిపై న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. శిబిరాల్లో ఆందోళనలు, దేవతలకు విన్నపాలు, న్యాయస్థానం-దేవస్థానం పేరిట పాదయాత్రలతో నిరసనలు హోరెత్తించారు.

ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొన్నారు. అవమానాలను భరించారు. ఆకాంక్ష కోసం అన్నింటిని దిగమింగారు. స్థానిక ప్రజల మద్దతు, అపూర్వ స్వాగతాలతో అలుపెరగని పోరాటంలో మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ఎక్కడా వివాదాల జోలికి పోకుండా అమరావతి ఎందుకు అవరసమో వివరిస్తూ...ముందుకు కదిలారు. మధ్యలో పోలీసుల అడ్డగింతను ఓర్పుగా, నేర్పుగా ఎదుర్కొంటూనే....45 రోజుల్లో యాత్రను పరిపూర్ణం చేశారు. తర్వాత కూడా వివిధ జిల్లాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేసి....అమరావతి ఆవశ్యకతను వివరించారు.

యాత్ర మధ్యలోనే 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నామంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ..మళ్లీ బిల్లును తెస్తామని ప్రకటించింది. బిల్లును ఉపసంహరించుకున్నాక విచారణ అక్కర్లేదని ప్రభుత్వం వాదించగా....బిల్లును మళ్లీ తెస్తామని చెప్పినందున నిర్ణయాన్ని వెల్లడించాలని రైతులు హైకోర్టును కోరారు. తీర్పు ఇస్తేనే ప్రభుత్వం మళ్లీ ముందుకు వెళ్లకుండా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు....తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. ఏకైక రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని ఆదేశించింది. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ని తప్పనిసరిగా అమలుచేయాలని....పురోగతికి ఎప్పటికప్పుడు వివరించాలని తేల్చిచెప్పింది. దీంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. తమ పోరాటం ఫలించిందని సంతోషం వెలిబుచ్చారు.

ఇదీ చదవండి:

High Court Verdict on Amaravati: సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.