ETV Bharat / city

విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ - విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ

విజిలెన్స్ కార్యాలయాల తరలింపు, మిలీనియం టవర్స్​కు నిధుల విడుదల, రాజధాని పనులు నిలిపివేయడం గురించి అమరావతి రైతులు వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. కార్యాలయాల తరలింపుపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

High court hearing on vigilance commission move to kurnool
విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ
author img

By

Published : Feb 12, 2020, 4:52 PM IST

విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ

ప్రభుత్వ కార్యాలయాల తరలింపు గురించి అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కర్నూలుకు విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌ కార్యాలయాల తరలింపు, విశాఖ మిలీనియం టవర్స్‌కు నిధుల విడుదల, రాజధాని పనులు నిలిపివేయడం గురించి రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. స్థలభావం కారణంగా కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నామని అడ్వకేట్​ జనరల్ కోర్టుకు తెలిపారు. స్థల వివరాలు, ఇక్కడ నుంచి కార్యాలయాలు ఎందుకు తరలిస్తున్నారనే దానిపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 17కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి : విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.