ETV Bharat / city

high court on sec: నీలం సాహ్ని నియామకంపై మరో పిల్​ అవసరం లేదు: హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్ని నియామకంపై మరో పిల్​ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఎస్​ఈసీ(sec)గా నీలం సాహ్ని కొనసాగించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిల్​ను హైకోర్టు పరిష్కరించింది.

high court hearing on sec Neelam Sahni appointment
నీలం సాహ్ని నియామకంపై మరో పిల్​ అవసరం లేదు
author img

By

Published : Aug 1, 2021, 3:15 AM IST

Updated : Aug 1, 2021, 4:00 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్ని కొనసాగించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ.. దాఖలైన పిల్​ను హైకోర్టు పరిష్కరించింది. ఎస్ఈసీ(sec) నియామకంపై ఇప్పటికే సింగిల్ జడ్జి విచారణ జరుపుతున్నారని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అప్పీళ్లు ధర్మాసనం ముందు పెండింగ్​లో ఉన్నాయని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఇదే వ్యవహారంపై మరో పిల్ అవసరం లేదని పేర్కొంది. ఆ పిల్​ను తోసిపుచ్చుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎస్ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎస్​ఈసీగా కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో పిల్ వేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎస్ఈసీ నీలం సాహ్ని రూ. 180 కోట్ల ప్రజాధనం వృథా చేశారని.. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని శైలజ కోరారు.

ఇదీ చదవండి..

Suspend: పదవీ విరమణ రోజే తహసీల్దార్ సస్పెన్షన్​!

Last Updated : Aug 1, 2021, 4:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.