ETV Bharat / city

HC ON GROUP1 EXAM: గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు - గ్రూప్ -1 ప్రధాన పరీక్ష కేసును రిజర్వు చేసిన న్యాయమూర్తి

గ్రూప్-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ.. దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

HC ON GROUP1 EXAM
HC ON GROUP1 EXAM
author img

By

Published : Sep 15, 2021, 7:04 AM IST

గ్రూప్ -1 ప్రధాన పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. గ్రూప్ -1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రశ్న పత్రాలను థర్డ్ పార్టీ తయారు చేసిందని, మూల్యాంకనం కూడా థర్డ్ పార్టీ చేసిందని, ఈ నేపథ్యంలో పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విన్నపాలతో గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం..తదుపరి చర్యలంటినీ నిలుపుదల చేస్తూ జూన్ 16న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మళ్లీ విచారణ జరిపిన కోర్టు..ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదీ చదవండి..

Rythu Kosam Telugudesam: 'రైతుకోసం తెలుగుదేశం' పేరుతో రెండోరోజు నిరసనలు ఎక్కడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.