ఎస్‌ఈసీపై సీఐడీ వేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ వేసేవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.
ఇదీ చదవండి: అన్లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి