ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కంటిమందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాలని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటిమందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంటిమందుకు అనుమతిస్తారా అని కోర్టు ప్రశ్నించగా.. అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది.
రోజుకు 15 నుంచి 20 మందే వస్తున్నారని ఆనందయ్య తరఫు న్యాయవాది బాలాజీ కోర్టుకు చెప్పారు. ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటిమందు తప్ప మిగతా వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. కంటిమందుకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్న ప్రభుత్వం.. నివేదిక వచ్చే వరకు 3 వారాల సమయం కావాలని హైకోర్టును కోరింది.
ఇదీ చదవండి: