ETV Bharat / city

'మే 3 నుంచి రోజువారి విచారణకు ధర్మాసనం నిర్ణయం' - amaravathi Issues

రాజధాని అమరావతికి సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ ఏ విధంగా జరగాలనే అంశంపై పిటిషనర్, ప్రభుత్వ న్యాయవాదులతో త్రిసభ్య ధర్మాసనం చర్చించింది. మే 3నుంచి రాజధాని వ్యాజ్యాలపైన విచారణ జరపనుంది.

High Court Decided to Inquiry on Amaravathi
మే 3 నుంచి రోజువారి విచారణకు ధర్మాసనం నిర్ణయం
author img

By

Published : Mar 26, 2021, 7:04 PM IST

Updated : Mar 27, 2021, 4:56 AM IST

సుంకర రాజేంద్రప్రసాద్​తో మా ప్రతినిధి ముఖాముఖి

రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ మే 3వ తేదీకి వాయిదా పడింది. విచారణను ఓసారి ప్రారంభించాక వరుసగా నిర్వహిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దేవదత్‌ కామత్‌, రంజిత్‌కుమార్‌, ఎంఎస్‌ ప్రసాద్‌, న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, వాసిరెడ్డి ప్రభునాథ్‌, సాయిసంజయ్‌ సూరనేని, కారుమంచి ఇంద్రనీల్‌బాబు, ఎస్‌.ప్రణతి, రవిశంకర్‌ జంధ్యాల తదితరులు వాదనలు వినిపించారు. ‘ఈ వ్యాజ్యాలు ఐదు కోట్ల ఆంధ్రప్రజల తలరాతలను నిర్ణయిస్తాయి. భారీగా పెట్టుబడులు పెట్టి రాజ్యాంగం ప్రకారం రాజధానిని నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అంతరాయం కలుగుతున్నందున రాజధాని వ్యాజ్యాలపై గతంలో జరిగిన భౌతిక, వీడియోకాన్ఫరెన్స్‌ (హైబ్రిడ్‌) విధానంలోనే విచారణలు చేపట్టాలి. కరోనా నిబంధనలను పాటిస్తూ వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వండి. షెడ్యూల్‌ నిర్ణయించి విచారణ చేపట్టండి. కొంతమంది సీనియర్‌ న్యాయవాదులు దిల్లీ నుంచి వచ్చి వాదనలు చెప్పాల్సి ఉంది. కరోనా రెండో విడత వ్యాప్తి నేపథ్యంలో ఆరు వారాల తర్వాత విచారణ చేపట్టాలి’ అని కోరారు.

ఏప్రిల్‌ రెండో వారంలో విచారణ జరపండి: ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో అత్యవసర విచారణ అవసరమన్నారు. షెడ్యూల్‌ ఖరారు చేసి, ఇరువైపుల న్యాయవాదులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ ఏప్రిల్‌ రెండో వారంలో హైబ్రిడ్‌ విధానంలో విచారణ జరపాలని కోరారు. సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ స్పందిస్తూ.. ఏప్రిల్‌ రెండో వారంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయికి వెళ్లే అవకాశం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏప్రిల్‌ రెండో వారంలో సెలవులు ఉన్నందున అప్పుడు విచారణ సాధ్యం కాదని పేర్కొంది. విచారణను ఓసారి ప్రారంభించాక షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. గతంలోనూ రాజధాని వ్యాజ్యాలపై హైబ్రిడ్‌ విధానంలో విచారణ జరిగినందున దాన్నే కొనసాగిద్దామని పేర్కొంది. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. వేసవి సెలవుల్లో కుటుంబసభ్యులతో వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. కేసుల విచారణ కోసం సెలవులను త్యాగం చేయకుండా చూడాలన్నారు. అందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

మాస్టర్‌ ప్లాన్‌ మార్చడానికి వీల్లేదు

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యాజ్యాలను రాజధాని వ్యాజ్యాల నుంచి వేరు చేసి విచారించాలన్న ఏజీ అభ్యర్థనపై న్యాయవాదులు సాయి సంజయ్‌, మురళీధరరావు అభ్యంతరం తెలిపారు. ఇళ్లస్థలాల పంపిణీ ముసుగులో రాజధాని నగర బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) మార్చడానికి వీల్లేదన్నారు. రాజధాని వ్యాజ్యాలతో కలిపే ఇళ్ల స్థలాల వ్యాజ్యాల్ని విచారించాలని కోరారు.

ఇదీ చదవండీ... రూ.90 వేల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్సుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

Last Updated : Mar 27, 2021, 4:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.