రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్మన్ ఆడిటోరియంలో జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 530 మంది న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసుల సత్వర విచారణలు, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటం, కక్షిదారులు, న్యాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలు పంచుకోవడానికి వీలుగా వీళ్లందరిని ఒకే వేదికపైకి తీసుకురావాలని... హైకోర్టు సీజే కృతనిశ్చయంతో ఉన్నారని హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తెలిపారు. జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ బడ్జిలు , జూనియర్ సివిల్ జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
ఇదీ చూడండి: నేరాల నియంత్రణలో వెనుకబడి ఉన్నాం: సుచరిత