బాలల హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన వేళ.... రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని....ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
పిల్లల హక్కుల పరిరక్షణ, చిన్న పిల్లల స్నేహపూర్వక న్యాయస్థానాల ఏర్పాటు, జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయడం కోసం హైకోర్టు సుమోటోగా పిల్ నమోదు చేసింది. 'బచపన్ బచావో ఆందోళన్' స్వచ్ఛంద సంస్థ ఇదే అంశంపై మరో పిల్ వేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు... పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని ప్రతివాదులకు నోటీసులు జారిచేసింది. విచారణను జూలై 21కి వాయిదా చేసింది.
ఇదీ చదవండి: