ETV Bharat / city

2014-19 మధ్య పాలకుల ఆర్ధిక వ్యయ నిబద్ధతపై కాగ్ ఆడిట్ - ap high court on tdp rule

ఆంధ్రప్రదేశ్​లో 2014-19 సంవత్సరాల మధ్య జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ పై కాగ్ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్థిస్తూ వినతి సమర్పించేందుకు పిటిషనర్‌కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. వినతి అందుకున్నాక దానిపై చట్ట ప్రకారం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కాగ్ ను ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Sep 4, 2020, 8:31 AM IST

ఆంధ్రప్రదేశ్ లో 2014-19 సంవత్సరాల మధ్య జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ విషయంలో కంప్రోలర్ ఆడిటర్ జనరల్ తో ప్రొసైటీ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్థిస్తూ వినతి సమర్పించేందుకు పిటిషనర్‌కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఇప్పటికే సమర్పించిన సమాచారంతో పాటు అదనపు వివరాలతో పది రోజుల్లో కాగ్ కు వినతి ఇవ్వాలని సూచించింది. పిటిషనర్ సమర్పించబోయే వినతి అందుకున్నాక దానిపై చట్ట ప్రకారం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కాగ్ ను ఆదేశించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె. ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది . 2014-19 సంవత్సరాల మధ్య జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ విషయంలో పాలకుల ఆర్ధిక వ్యయ నిబద్ధత అంచన నిర్వహించేలా కాగ్ ను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఎం. నారాయణాచార్యులు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తాజాగా హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రొసైటీ ఆడిట్ కోసం పిటిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న కాగ్ కు వినతి సమర్పించామని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం లేదన్నారు. వినతి పై కనీసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో పిటిషనర్ కు తెలియజేయలేదన్నారు . రాజధాని నిర్మాణం, తదితర వ్యయాల్ని ఆడిట్ చేసేందుకు కాగ్ ఉత్తమమైన వ్యవస్థ అన్నారు. ఫిబ్రవరిలో కాగ్ కు వినతి సమర్పించారని గుర్తుచేసిన ధర్మాసనం.. అదనపు వివరాలతో తాజాగా ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది. పిటిషనర్ సమర్పించబోయే వినతిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కాగ్ ను ఆదేశించింది.

ఇదీ చదవండి: రైతులపై ఒక్క పైసా భారం పడబోదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.