ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని కలిసి .. సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఏ బకాయిలను చెల్లించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు . వైద్య సాయం కింద అందిస్తున్న రూ .2 లక్షల రీయింబర్స్‌మెంట్‌ను రూ .4 లక్షలకు పెంచాలని... ఉద్యోగుల పిల్లలకు స్థానికతను క్లయిమ్ చేసుకునే గడువును మరో ఏడాది పొడిగించాలని కోరారు.
సీఎంను కలిసిన వారిలో సంఘ అధ్యక్షుడు ఏ.వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె.సురేంద్రనాథ్, కార్యదర్శి ఎస్.సతీష్ వర్మ, సంయుక్త కార్యదర్శులు టి.కోటేశ్వరరావు, ఎన్.పీరుసాహెబ్, కార్యనిర్వహణ సభ్యులు జి.చంద్రబాబు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జ్ఞాపికను అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: డ్యాన్స్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి.. మోదీ కితాబు