ETV Bharat / city

ఎంపీ గోరంట్ల వీడియోపై సీబీఐకి హైకోర్టు న్యాయవాది లేఖ - సీబీఐకి హైకోర్టు న్యాయవాది లేఖ

HC LAWYER ON YCP MP GORANTLA వైకాపా ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఈ మెయిల్​ ద్వారా సీబీఐకి ఫిర్యాదు చేశారు. మాధవ్​పై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

HC ADVOCATE COMPLAINT TO CBI
HC ADVOCATE COMPLAINT TO CBI
author img

By

Published : Aug 16, 2022, 8:14 PM IST

High Court Lawyer complaint on MP Gorantla Madhav video issue: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఈమెయిల్‌ ద్వారా చెన్నై జాయింట్‌ డైరెక్టర్ కార్యాలయానికి పంపారు. ఫిర్యాదుతో పాటు మాధవ్​కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను జతపరిచారు. మాధవ్ వ్యాఖ్యల వల్ల రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాధవ్​పై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అమిత్​ షాకు లేఖ: అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో క్లిప్‌.. ఫేక్‌, మార్ఫింగ్‌ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పడం మహిళా లోకాన్ని విస్మయానికి గురి చేసిందంటూ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు శుక్రవారం లేఖ రాశారు. కోట్లాది మహిళల ఆత్మగౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నందున ఆ వీడియో క్లిప్‌పై కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని అభ్యర్థించారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను చూసి ఏ నాగరిక సమాజమైనా సిగ్గుతో తలదించుకుంటుంది. దిశ అని ప్రత్యేక చట్టం లేకున్నా ఏపీ ప్రభుత్వం ఆ పేరుతో మహిళల్ని మోసం చేస్తోంది. వైకాపా నాయకుల మద్దతు, ప్రోత్సాహంతో అసాంఘిక శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏపీ పోలీసుల నివేదిక ప్రకారం 2020లో మహిళలపై 14,603 నేరాలు జరగ్గా 2021కి అవి 17,736కి (21.45%) పెరిగాయి’ అని లక్ష్మీనారాయణ లేఖలో వివరించారు. ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర హోం శాఖ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నేరస్తుల్ని తప్పించడంలో వైకాపా ప్రభుత్వం, పోలీసులు, అధికారుల పాత్రపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫకీరప్పపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి: మాధవ్‌ వీడియో క్లిప్‌పై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని లక్ష్మీనారాయణ డీజీపీకి మరో లేఖ రాశారు. ‘వీడియో క్లిప్‌పై విచారణ జరుగుతుండగానే వాస్తవాల్ని వక్రీకరించి వివరాలు బహిర్గతం చేయడం పోలీసుల ఎథిక్స్‌, స్టాండింగ్‌ ఆర్డర్లకు విరుద్ధం. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఫకీరప్ప ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి నాలుగో (గురువారం) తేదీ రాష్ట్రంలో కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు రాత్రి (బుధవారం) ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు.

ఎస్పీ ఏమన్నారంటే.. "వీడియో కాల్‌ విషయంపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన కేసు నమోదు చేశాం. అనంతరం చేపట్టిన దర్యాప్తులో భాగంగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రివేళ 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో మొదటగా.. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ వీడియో షేర్ చేసినట్టు గుర్తించాం. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వొడాఫోన్‌ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు. ఒకరు మొబైల్‌లో చూస్తున్నప్పుడు.. దాన్ని మరొకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్‌ చేశారు. రీ-పోస్టు చేశారు. ఐ -టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో తొలిసారి పోస్టు చేసింది కూడా.. ఫార్వర్డ్‌ చేసిన వీడియోనే. అది ఒరిజినల్‌ వీడియో కాదు కాబట్టి.. అది మార్ఫింగ్‌ చేశారా? లేదా? అనేది తేల్చలేకపోతున్నాం.

ఒరిజినల్‌ వీడియో దొరికే వరకు.. దాన్ని మొదట పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు.. ఈ విషయాన్ని నిర్ధారించలేము. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే.. అది మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేం. సోషల్‌ మీడియాలో చూస్తున్న వీడియో ఒరిజినల్‌ కాదు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం. వీడియోను యూకేలో ఎడిటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్‌ వీడియో ఎవరి వద్దైనా ఉంటే.. బాధితులు ఎవరైనా ముందుకొచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ నివేదిక వస్తుంది" అని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.