ETV Bharat / city

"చంద్రబాబుపై పోటీనా.. నేనా..??" - కుప్పం నుంచి పోటీపై హీరో విశాల్​ కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజక వర్గం‌ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం‌ ట్రెండింగ్​గా మారటంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

babu
babu
author img

By

Published : Jul 2, 2022, 10:25 AM IST

వచ్చే 2024 ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్‌ రంగంలోకి దిగబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలోనూ ఇది ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయంపై స్పందించిన విశాల్‌... అవన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే వదంతులు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నా. రాజకీయాలకు సంబంధించి నన్ను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నా. ఏపీ పాలిటిక్స్‌లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని విశాల్‌ తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సామాన్యుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్‌. ప్రస్తుతం ‘లాఠి’, ‘తుప్పరివాలన్‌ 2’ (తెలుగులో డిటెక్టివ్‌ 2) తదితర చిత్రాలతో విశాల్‌ బిజీగా ఉన్నారు.

vishal
vishal

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.