ETV Bharat / city

కృష్ణా, గోదావరిలో సాధారణం కంటే అధిక ప్రవాహాలు - heavy water flow to Krishna

కృష్ణా, గోదావరి నదుల్లో సాధారణం కన్నా ఈ ఏడాది ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర జల సంఘం నివేదికలో విశ్లేషించింది. దేశంలోని 123 జలశయాల్లో పుష్కలంగా నీరు ఉందని వెల్లడించింది. ఈ తరహా నీటి నిల్వలు పదేళ్లలో ఎప్పుడూ లేవని అభిప్రాయపడింది.

heavy water flow
heavy water flow
author img

By

Published : Jul 24, 2020, 7:26 AM IST

దేశంలో కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో ఉన్న 123 జలాశయాల్లో అత్యధికం నీళ్లతో కళకళలాడుతున్నాయని ఆ సంఘం నివేదిక విశ్లేషించింది. గడిచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంది. మొత్తం 123 జలాశయాల్లో గురువారం నాటికి 66.372 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీళ్లు ఉన్నట్లు పేర్కొంది. జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 39శాతం. అంటే వర్షాకాలం ప్రారంభమైన తొలినాళ్లలోనే మూడింట ఒకొంతుకు పైగా జలాశయాలు నీళ్లతో కనిపిస్తుండటం గమనార్హం. గత ఏడాది ఇదే సమయానికి 42.826 బీసీఎం నీళ్లే వీటిలో ఉన్నాయి. అదే 10 సంవత్సరాల సగటు పరిశీలిస్తే 55.824 బీసీఎంలే. జలాశయాల్లో గత సంవత్సరంతో పోల్చినా 155శాతం అధికంగా నీళ్లు ఉన్నట్లు చెబుతున్నారు.

కృష్ణా, గోదావరి నదుల్లో సాధారణం కన్నా ఈ ఏడాది ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గత పదేళ్ల సగటు ప్రవాహాల కన్నా ఎక్కువ ఉన్నాయి. గంగా, నర్మద, కావేరి, మహానది, ఇండస్‌, శబర్మతి, తపతిలోనూ ప్రవాహాలు బాగానే ఉన్నాయి. పశ్చిమానికి ప్రవహించే నదుల్లో మాత్రం నీటి ప్రవాహాలు ఇలా లేవు.ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో మొత్తం 36 జలాశయాలు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 52.81 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా ప్రస్తుతం 18.69 బీసీఎం నీళ్లున్నాయి.

ఇదీ చదవండి:

భారత్​-చైనా మధ్య త్వరలోనే మరో దఫా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.