వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబంగా దిశగా కదులుతూ... ఉత్తర కోస్తాంధ్ర, యానాంకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:
అత్యున్నత పరీక్షలో ఉన్నతంగా.. నిలిచి గెలిచిన తెలుగు తేజాలు..!