తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఇవాళ, రేపు కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈనెల 12 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇవాళ విశాఖ విమానాశ్రయం, అనకాపల్లి, అరకులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి..