Hyderabad Rains Today: అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ జలమయమైంది. భారీగా వరదనీరు చేరడంతో రహదారులు చెరువులను తలపించాయి. ఆఫీస్ పనులు ముగించుకొని సరిగ్గా ఇండ్లకు వెళ్లే సమయానికే వరణుడు విజృంభించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో పలు వాహానాలు నీటిలో చిక్కుకున్నాయి.
మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో పెద్దఎత్తున వర్షం కురవడంతో వారాంతపు సంతలోని కూరగాయల తోపుడు బండ్లు కొట్టకుపోయాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, షేక్‌పేట, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసాయి. మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట, సంతోష్‌నగర్, సరూర్ నగర్, చంపాపేట్ నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ, ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.
ఎల్బీనగర్ రోడ్లు జలమయం: పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, బంజారాహిల్స్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్ జాగీర్, మణికొండ, ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి ఎల్బీనగర్ రోడ్లన్నీ జలమయమయ్యాయి.
నీట మునిగిన మూసారాంబాగ్ వంతెన: మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో జల్లులు కురిసాయి. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అంబర్‌పేటలో కురిసిన భారీ వర్షానికి మూసారాంబాగ్ వంతెన నీట మునిగింది. అమీర్‌పేట్‌లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది.
నాంపల్లిలో అత్యధికం..హయత్‌నగర్‌లో అత్యల్పం: ముషీరాబాద్ , హబ్సిగుడ, రామంతపూర్‌లో భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాతబస్తీ ఉస్మాన్‌గంజ్‌లో వరద ప్రవాహానికి కాలనీలలోని ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మల్లేపల్లిలోని పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా.. హయత్‌నగర్‌లో అత్యల్పంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి: