వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. రహదారులపై భారీ వరద నీరు ప్రవహించడం వల్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఎక్కడిక్కడ వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షంతో నగరంలో రోడ్లు కాలువలను చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రధాన రహదారులపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడం వల్ల వరద నీటిలో వాహనాలు ఇరుక్కుపోయాయి.
నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షపు నీరు నిలిచేచోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ పార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే విద్యుత్ అధికారులకు తెలియచేయాలని వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉన్నా వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నా స్థానిక విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఇదీ చదవండి: