మెరిసిన విమానాలు.. మురిసిన జనాలు.. ఆకట్టుకున్న ఎయిర్ షో..! - wings india aviation show
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కొనసాగుతున్న.. 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్ షోకు చివరిరోజున సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మండుటెండను లెక్కచేయకుండా చిన్నారులతో కలిసి కుటుంబసమేతంగా ప్రదర్శనను తిలకించేందుకు వచ్చారు. దీంతో.. బేగంపేట విమానాశ్రయం పరిసరాలు జనాలతో సందడిగా మారాయి. వివిధ రకాల విమానాలను దగ్గరగా చూస్తూ చిన్నాపెద్దా ఆనందంలో మునిగి తేలారు. సారంగ్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.