రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమన్నారు. హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.
ఈ క్రమంలో కోర్టు ఎదుట హాజరుకావాలని పిటిషనర్‌తో పాటు 12 సంఘాల నేతలను ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరిగి విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ విచారించే రోస్టర్‌లో తమ బెంచ్ లేదని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజనం, వ్యక్తిగత పిటిషన్ వల్ల నిర్ణయాధికారం తమకు లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తికి పంపుతున్నామని వెల్లడించింది. పిటిషన్‌తో రాష్ట్రంలోని అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి: Atmakuru incident: జగన్ అసమర్థతతో ఏపీలో అరాచక పాలన: కేంద్రమంత్రి మురళీధరన్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!