రాయలసీమ ఎత్తిపోతలపై (rayalaseema lift irriagation) ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో వాదనలు జరిగాయి. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఎన్‌జీటీ చట్టం సెక్షన్ 26, 28 కింద చర్యలు తీసుకోవచ్చని కోర్టుకు సూచించారు. ఈ నెల 30న ఏపీ సీఎస్ రిటైర్ అవుతున్నారని పిటిషనర్ వెల్లడించారు.
కేసును తప్పుదోవ పట్టించేలా ఏపీ సీఎస్ అఫిడవిట్లు వేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 27న తెలంగాణ వాదనలు వినిపించనుంది. అనంతరం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటీ తీర్పు ఇవ్వనుంది. ఎన్జీటీ అధికారాలపై సుప్రీం తీర్పులను.. పిటిషనర్ న్యాయవాది ప్రస్తావించారు. తీర్పు ఉల్లంఘన జరిగినప్పుడు కఠినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ పిటిషన్..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (rayalaseema lift irriagation) సంబంధించి గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, బాధ్యులైన అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ జి. శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది.
ఏపీ వాదనలు ఇలా..
ఈ నెల16న ఇదే అంశంపై ఎన్జీటీలో సుదీర్ఘ విచారణ జరిగింది. ఉల్లంఘనపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా ? అనే అంశంపై ఏపీ వాదనలు వినిపించింది. ప్రజోపయోగ పనులు చేపట్టినందుకు జైలుకు పంపుతారా అని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు చేసినవి డీపీఆర్, ఇతర పనుల కోసమేనన్న ప్రభుత్వం.. చేసిన పనులు పూడ్చమంటారా ? అని ఎన్జీటీని ప్రశ్నించింది. ప్రజోపయోగ పనులను ట్రైబ్యునల్ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు ఇచ్చిందని..తప్పుడు ఫొటోలు పంపిన తెలంగాణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: