రాష్ట్రంలో మెుదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ స్పష్టం చేశారు. రెండో డోస్ టీకాల తీసుకునే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మెుదటి విడత టీకా వేసేందుకు తగినన్ని టీకాలు లేవని వెల్లడించారు.
మరో 3.50 లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు. రూ. 180 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ విధుల్లోని సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: